ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

Showing posts with label General Health Tips. Show all posts
Showing posts with label General Health Tips. Show all posts

FAIL TO DETECT SMELL LEADS TO MEMORY LOSS / Early Signs of Alzheimer's


NATURAL HEALTH TIPS


ZEKA VIRUS


HEALTH DISORDERS WITH USING IRON TABLETS REGULARLY


ఐరన్‌ ట్యాబ్లెట్లు వాడుతున్నారా? 

కాస్త నీరసంగా అనిపించినా అనీమియా అని తేలినా వెంటనే మెడికల్‌ షాపుకెళ్లి ఐరన్‌ ట్యాబ్లెట్లు కొనుక్కొచ్చి వేసుకోవడం మొదలుపెడతాం. కానీ అవి ఎక్కువగా వాడటం మంచిది కాదు అంటున్నారు లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజ్‌కు చెందిన పరిశోధకులు. ఎందుకంటే రక్తంలో ఐరన్‌ నిల్వలు పేరుకోవడంవల్ల డీఎన్‌ఏ దెబ్బతింటుందట. ఐరన్‌ మన శరీరానికి చాలా అవసరం. ఆక్సిజన్‌ సరఫరాలో అది మరీ కీలకం. కానీ సప్లిమెంట్ల రూపంలో ఐరన్‌ తీసుకున్నప్పుడు అది రక్తంలో చేరిన పది నిమిషాల్లోనే కణాల్లోని డీఎన్‌ఏను మార్పునకు గురిచేస్తుంది. ఫలితంగా కణాలు దెబ్బతింటున్నాయని తేలింది. ‘అధిక మోతాదులో ఐరన్‌ను తీసుకున్నప్పుడు కణాలు దెబ్బతింటాయని తెలుసు. కానీ కొద్దిగా తీసుకున్నప్పుడు కూడా అది కణాలను దెబ్బతీస్తోంది. అయితే ప్రయోగనాళికల్లో వచ్చిన ఈ ఫలితమే వ్యక్తుల రక్తనాళాల్లోనూ కచ్చితంగా కనిపిస్తుందని నిర్ధరించలేం. కాబట్టి ఇప్పుడే సప్లిమెంట్లను వాడటం ఆపేయాలని చెప్పలేం. కానీ అతిగా వాడటం మంచిది కాదు’ అని సంబంధిత నిపుణులు వివరిస్తున్నారు.

BEWARE OF DRINKING GREEN TEA - LIMIT DRINKING GREEN TEA OTHERWISE IT WILL EFFECTS HEALTH


అతిగా తాగితే గ్రీన్‌టీ అనర్థమే! 

ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా గ్రీన్‌టీ తాగడం మంచిదేగానీ... అతిగా తాగితే మాత్రం అనర్థమేనంటున్నారు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు! డ్రోసోఫిలా మెలనోగాస్టర్ అనే ఈగలకు అధిక మోతాదులో గ్రీన్‌టీ ఇవ్వడం వల్ల, వాటిలో ఎదుగుదల, ప్రత్యుత్పత్తి సామర్థ్యం తగ్గాయనీ... మనుషుల్లోనూ ఇదే ప్రభావం ఉండొచ్చని వారు చెబుతున్నారు.సాధారణం కంటే ఎక్కువగా గ్రీన్‌టీ తాగిన ఈగలు ఆకలికి, అధిక వేడికి తట్టుకునే సామర్థ్యాన్ని కోల్పోయినట్లు గుర్తించామన్నారు. ఆడ ఈగల్లోనైతే, పునరుత్పత్తి సామర్థ్యం 17% తగ్గిపోయిందనీ... వాటికి తక్కువ సంఖ్యలో, సాధారణం కంటే చిన్న పరిమాణంలో పిల్లలు పుట్టాయన్నారు. ఎలుకలు, కుక్కులపైనా అధిక మోతాదు గ్రీన్‌టీ ప్రభావం దాదాపు ఇలాగే ఉన్నట్లు వివరించారు. ''తక్కువ మోతాదులో తీసుకుంటేనే గ్రీన్‌టీ వల్ల ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు. అదేపనిగా అధిక మోతాదులో దానిని తాగడం వల్ల శరీరంలోని కణాలు మృత్యువాత (అపోప్టోసిస్)కు గురవుతాయి'' అని పరిశోధనకు నేతృత్వం వహించిన మెహ్తాబ్ జాఫ్రీ తెలిపారు.


Very Important Qualities we have to Follow them Good Health - General Tips to live a Day happily


Very Important Qualities we have to Follow them Good Health.....

. ఎంత డబ్బు దర్పం ఉన్నా కూడా మన ఇంటి ముందుకు వచ్చే పని వాళ్ళను ,

 పాల వాళ్ళను పలకరించాలి .... ఇక్కడ కింద ఉన్న అన్ని లక్షణాల్లో 

ఏది మీకు ఎక్కువ ఇష్టమో షేర్ చేసుకోండి ,

 Once in a While మంచిగా హాయిగా కూల్ గా నవ్వుకొండి .